నామినేషన్ దాఖలు చేసిన వైసిపి అభ్యర్థి నాగ వినిత. హాజరైన మేయర్ ,డిప్యూటీ మేయర్ లు. అనంతపురం నగర పాలక సంస్థ 17వ డివిజన్ కు జరుగుతున్న ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా చింతకుంట నాగ వినిత బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.
నగర పాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిననామినేషన్ దాఖలు కేంద్రంలో మేయర్ మహమ్మద్ వసీం,డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, కోగటం విజయ్ భాస్కర్ రెడ్డి లతో కలసి ఆమె నామినేషన్ దాఖలు చేశారు.ఎన్నికల అధికారి దుర్గా ప్రసాద్ కు వైకాపా అభ్యర్థిగా చింతకుంట నాగ వినిత రెండు సెట్ల నామినేషన్ లు దాఖలు చేశారు.