ఏ.ఎఫ్. ఎకాలజీ యూత్ సెంటర్ ఆధ్వర్యంలో అనంతపురము జిల్లాలోని నిరుద్యోగ యువకులకు నైపుణ్య శిక్షణా మరియు ఉద్యోగ అవకాశములు.
స్థానిక ఏ.ఎఫ్.ఎకాలజీ యూత్ సెంటర్, అనంతపురము నందు 2 వీలర్ / మోటార్ మెకానిక్ (మరమ్మత్తులు) కోర్సు నందు శిక్షణ. అధిక నాణ్యత గల సాంకేతికత మరియు సౌకర్యాలతో 2 వీలర్ మెకానిక్ (మరమ్మత్తులు) నందు శిక్షణ ఇవ్వబడుతుంది. 2 వీలర్ /మోటార్ మెకానిక్ (మరమ్మత్తులు) శిక్షణతో పాటు కస్టమర్లతో ఎలా వ్యవహరించాలో శిక్షణ ఇవ్వబడుతుంది. 2 వీలర్ /మోటార్ మెకానిక్ (మరమ్మత్తులు) శిక్షణతో పాటు ప్రతి విద్యార్థికి ఇంగ్లీష్ నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసం, ప్రథమ చికిత్స యందు శిక్షణ ఇవ్వబడుతుంది.
కోర్సు వ్యవధి – 45 రోజులు.
వయస్సు – 18 – 30 సంవత్సరాలు.
విద్యార్హత – 7 వ తరగతి పాస్ / ఫెయిల్, 10 వ తరగతి పాస్ / ఫెయిల్ & ఐటిఐ పాస్ / ఫెయిల్ and ఇంటర్మీడియట్ పాస్ / ఫెయిల్.
ఏ.ఎఫ్. ఎకాలజీ సెంటర్ ఆద్వర్యంలో శిక్షణ పూర్తయిన తదనంతరం ప్రతి విద్యార్థికి ఉచితముగా టూల్ కిట్ మరియు సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది . శిక్షణానంతరం ప్రతి విద్యార్థికి 100% వివిధ సంస్థల యందు ఉద్యోగ అవకాశములు కల్పించబడును.
శిక్షణ కేంద్రం: చిరునామా – ఏ.ఎఫ్.ఎకాలజీ సెంటర్, ఆర్డీటీ స్టేడియం దగ్గర,ఉప్పరపల్లి రోడు, అనంతపురము.
మరిన్ని వివరముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :–
9390505956
9390505952
6303580397
కావున నిరుద్యోగ యువకులు ఈ శిక్షణా కార్యక్రమాలను వినియోగించుకొని ఉపాధి అవకాశములు పొందవలసినదిగా కోరడమైనది.
డా|| వై. వి. మల్లారెడ్డి
డైరెక్టరు, ఏ.ఎఫ్.ఎకాలజీ సెంటర్.