●తెలీని కులాలను వెలుగులోకి తెచ్చిన ఘనత జగన్..!
●సామాజిక న్యాయానికి కేరాఫ్ మా ముఖ్యమంత్రి..!
●సామాజిక న్యాయభేరి’ని విజయవంతం చేయండి ఎమ్మెల్యే #తోపుదుర్తిప్రకాష్రెడ్డి గారు పిలుపు..!
●పోస్టర్లు విడుదల చేసిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, ఎంపి గోరంట్లమాధవ్ గారు, SVVU బోర్డ్ మెంబరు తోపుదుర్తి నయనతారెడ్డి గారు..!
బిసిలంటే బ్యాక్ వర్డ్ క్లాసెస్ కాదు బ్యాక్ బోన్ క్లాసెస్ అంటూ వారికి బలాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తున్న అభినవ పూలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కొనియాడారు. ఈనెల 26 నుంచి 29 వరకు బిసి, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ వర్గాలకు చెందిన మంత్రులు చేపట్టనున్న ‘సామాజిక న్యాయభేరి’ ముగింపు సభను జిల్లాలో జయప్రదం చేయాలని ఎమ్మెల్యే, ఎంపీ, SVVU బోర్డు మెంబరు పిలుపునిచ్చారు. సోమవారం రాప్తాడులో జరిగిన కార్యక్రమంలో వారు ‘సామాజిక న్యాయభేరి’ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ‘సామాజిక న్యాయభేరి’ యాత్ర శ్రీకాకుళం మొదలై అనంతపురంలో ముగుస్తుందన్నారు. ‘అనంత’లో జరిగే ముగింపు సభలో 60-70 వేలమంది పాల్గొనబోతున్నారన్నారు. అణగారిన వర్గాలను, ఎక్కడున్నాయో కూడా తెలీని కులాలను వెలుగులోకి తెచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డిది అన్నారు. అన్ని కులాలకు ప్రాధాన్యత కల్పించి కార్పొరేషన్లను ఏర్పాటు చేసి హోదాలు కల్పించారన్నారు. సామాజిక న్యాయానికి కేరాఫ్ మా ముఖ్యమంత్రి గారు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజిక న్యాయం చేసి ఉంటే జనాలు ఆయనవెంట ఉండాలి. జిల్లా పర్యటనలో అది తేలిపోయిందన్నారు. ‘సామాజిక న్యాయభేరి’ సభకు జిల్లా వ్యాప్తంగా బిసి,ఎస్సి,ఎస్టీ,మైనార్టీ వర్గాల ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, మండల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు..