కియ పరిశ్రమ వారి ఔదార్యం… 61,500 సర్జికల్ మాస్కుల అందజేత అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎరమంచలి వద్ద ఉన్న కియ పరిశ్రమ వారు ఔదార్యం చూపారు. రూ. 1.85 లక్షల విలువ చేసే 61,500 సర్జికల్ మాస్క్ లను జిల్లా పోలీసుశాఖకు అందజేశారు. మాస్కులు అందజేసిన కియ పరిశ్రమ వారిని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు అభినందించి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈకార్యక్రమంలో కియ పరిశ్రమ హెడ్ ఆఫ్ లీగల్ అండ్ కార్పోరేట్ అఫైర్స్ జుడే లీ, ప్రిన్సిపాల్ అడ్వయిజర్ డాక్టర్ సోమశేఖరరెడ్డి, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డి, CSR మేనేజర్ డాక్టర్ రవిశంకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.