గతంలో నేను చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షం వక్రీకరించింది: చింతమనేని

గతంలో నేను చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షం వక్రీకరించింది: చింతమనేని

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గతంలో చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. గత నెల మొదటి వారంలో పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలో నిర్వహించిన ‘జన్మభూమి’ కార్యక్రమంలో పాల్గొన్న చింతమనేని, దళితుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నారు. ‘మీరు దళితలు, మీకెందుకురా రాజకీయాలు..’ అంటూ దళితులపై చింతమేనేని ఇబ్బందికర వ్యాఖ్యలు చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చేరడంతో వైరల్ గా మారింది. ఈ వ్యవహారంపై చింతమనేని తన నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతల తీరును నిరసిస్తూ ధర్నా నిర్వహించారు.

అనంతరం, ఏలూరులో జిల్లా ఎస్పీకి ఓ వినతిపత్రం సమర్పించారు. ఆ తర్వాత మీడియాతో ఆయన మాట్లాడుతూ, దెందులూరులో తనను రాజకీయంగా ఎదుర్కోలేకనే ప్రతిపక్షం తనపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని అన్నారు. దళితులు బాధపడేలా తాను మాట్లాడలేదని స్పష్టం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్టు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *