వజ్రకరూరు శాఖా గ్రంధాలయం లో “వేసవి విజ్ఞాన శిబిరాల” లో భాగంగా శనివారం సమ్మర్ క్యాంప్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా జిల్లా గ్రంథాలయసంస్థ చైర్ పర్సన్ ఉమా మోహన్ రెడ్డి మరియు కార్యదర్శి రమ విచ్చేసి సమ్మర్ క్యాంపు ను పరిశీలించారు.
విద్యార్థిని విద్యార్థులను ఈ సమ్మర్ క్యాంప్ నందు వారు చదివిన పుస్తకము గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, గ్రంధాలయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఈ 45 రోజుల కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశ్యం వేసవి సెలవల్లో విద్యార్థినీ విద్యార్థులు అందరూ గ్రంథాలయము నకు ప్రతిరోజూ వచ్చి గ్రంథాలయంలోని పుస్తకాల పై మక్కువ పెంచుకోవాలని, అలాగే ఈరోజు లాగే ప్రతి రోజు కూడా ఇక్కడ పుస్తకాలు చదవడం, కథలు చెప్పడం, స్పోకెన్ ఇంగ్లీష్ , డ్యాన్స్ లు , డ్రాయింగ్ ఆటలు, ఇలా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేసారు.
విద్యార్థిని విద్యార్థులు బాల్యం నుంచే మీ మెదడుకు పదును పెట్టాలని అందుకు ఉన్న ఏకైక సాధనం గ్రంధాలయం అని తెలియజేసారు. ఉమా మోహన్ రెడ్డి కి పూర్ణకుంభ స్వాగతం పలికారు. సభ అధ్యక్షురాలిగా గ్రంథాలయాధికారిని మునెమ్మ వహించారు. గ్రామ సర్పంచ్ మోనాలుసా మరియు గ్రంథాలయ అధికారిని మునెమ్మ ఆధ్వర్యంలో ఉమా మోహన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోనాలిసా,నేతాజీ అవార్డు గ్రహీత బెంజిమెన్, జాతీయ సేవా అవార్డు గ్రహీత ఎంపి మల్లికార్జున, గ్రంథాలయాధికారి ని మునెమ్మ, రిసోర్స్ పర్సన్ మహబూబ్ భాష, రిటైర్డ్ ఎం పి ఈ హెచ్ ఓ పట్టా కాజా పీరా, వలి,పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, గ్రంథాలయ పాఠకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.