ప్రజల్లో మమేకమై మెరుగైన సేవలు అందించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు సూచించారు. ఏ.ఆర్ నుండీ సివిల్ కన్వర్షన్ అయిన కానిస్టేబుళ్లు జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
సివిల్ విభాగంలో ప్రజలతో ఎక్కువ కలిసే వీలుంటుందని… ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈసమావేశంలో జిల్లా పోలీసు అధికారుల సంఘం సాకే త్రిలోక్ నాథ్ , సుధాకర్ రెడ్డి, సివిల్ విభాగానికి కన్వర్షన్ అయిన 1994, 1995 మరియు 2004 బ్యాచ్ లకు చెందిన ఏపీఎస్పీ, ఏ.ఆర్ కానిస్టేబుళ్లు, తదితరులు పాల్గొన్నారు.