ఈరోజు గాయత్రి దేవి అలంకరణ, లోకకల్యాణం కోసం మనం గాయత్రి మాతను కొలుస్తాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం.
రేపటి నుంచి రద్దీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి భక్తుల కావాల్సిన సదుపాయాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నాం. 30 నుంచి 40 నిమిషాలలోనే అమ్మవారి దర్శనమ్ కలుగుతోందని భక్తులు చెప్తున్నారు. అమ్మవారి దయ రాష్ట్ర ప్రజల మీద, ప్రభుత్వం మీద ఉండాలి.