ఇన్ని రోజులకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు దేవుడు భూముల ,ఆస్తులవిషయములో మంచి ఆలోచనకు రావటం జరిగింది. అనేక హిందూ సంస్థలు,హిందువు ల మనోభావాలు అర్థం చేసుకొని ముందుకు వచ్చినందుకు ఎండోమెంట్ అధికారులకు, ప్రబుత్వానికి ప్రత్యేక ధన్యవాదములు. దేవుడు భూములు, ఆలయాల ఇతర ఆస్తులను ఆక్రమించుకొనే వారిపై కోర్టులో క్రిమినల్ కేసులు నమోదు చేసే అధికారాన్ని సంబంధిత ఆలయ ఈ ఓ లేదా జిల్లా దేవాదాయ శాఖ కమిషనర్లకు ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుతం ఆక్రమణ దారులపై కేసులు నమోదు చేయాలంటే దేవదాయ శాఖ చట్టంలోని 86 (3) సంబంధిత ఆలయ ఈ వో లు దేవాదాయశాఖ కమిషనర్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది.
ఇప్పుడు అధికారాన్ని సంబంధిత ఆలయ ఈవో లేదా జిల్లా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కి బదలాయిస్తూ దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణిమోహన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో దేవుడు భూములు ఇతర ఆస్తులు ఆక్రమణ దారులపై ఎటువంటి జాప్యం లేకుండా స్థానిక అధికారులు తక్షణమే చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు దేవాదాయ శాఖ పరిధిలో వివిధ ఆలయాల పేరిట 4.09 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి ఆ భూముల్లో లో అందులో 67,525 ఎకరాల ఆక్రమణలకు కు గురి అయినది మరో 3,613 ఎకరాలను వాటి లీజు గడువు ముగిసిన సంబంధిత లీజు దారులు వాటిని తమ ఆధీనంలో ఉంచుకున్నారు కావున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాల భూములను ఆస్తులను కాపాడు కోవడం గ్రామ గ్రామాన ఉన్న ప్రతి హిందూ కార్యకర్త తమ సొంత ఆస్తి వలే భావించి సంబంధిత అధికారులకు లేదా హిందూ ధార్మిక సంస్థలకు తెలియాయచెయ్యాలని హిందూ దేవాలయ పరిరక్షణ ట్రస్ట్ (HDPT) చైర్మన్ వెలగపూడి రామకృష్ణ తెలియచేసారు. ఒకవేళ కబ్జాకు గురి అయిన దేవాలయ భూములు గాని ఆస్తుల వివరాలు గానీ నేరుగా HDPT ప్రాంత కార్యాలయానికి తెలియజేయగలరు అని వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచ పడతాయి అని వారు ఒక ప్రకటనలో తెలియజేశారు .