నా కులం ఏంటో చెక్ చేసుకోండి….. అమరావతి సభలో వంగవీటి రాధ సంచలన వ్యాఖ్యలు..
గుంటూరు జిల్లా…
అమరావతి ఒక కులం వారిది మాత్రమే అంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మండిపడ్డారు. ఇక్కడ వేదికపై ఉన్న వారంతా ఎవరెవరు ఏ కులమో జాగ్రత్తగా చూసుకోండని చెప్పారు. మీకేమైనా డౌట్ ఉంటే తన కులం ఏమిటో కూడా చెక్ చేసుకోవచ్చని అన్నారు. తాను దివంగత రంగాగారి అబ్బాయినని, తన కులం ఏమిటో రికార్డుల్లో చెక్ చేసుకోవచ్చని చెప్పారు. తాను రాష్ట్రం కోసం పోరాడుతానని అన్నారు.
చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బురద చల్లుతూ, రైతులను ఎటకారం చేస్తూ, రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి ఆడుకుంటున్నాడని ముఖ్యమంత్రి జగన్ పై రాధా మండిపడ్డారు. ప్రజలందరూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా కలసికట్టుగా ప్రభుత్వంపై పోరాటం చేసి, రాష్ట్రాన్ని కాపాడుకుందామని చెప్పారు. అమరావతి కోసం పక్కన నిరాహారదీక్ష చేస్తున్నారని… వాళ్లంతా ఏ కులమో వచ్చి చూసుకోవాలని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. అందరి ఆశ, శ్వాస అమరావతే అని చెప్పారు.