అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు నిర్వహించిన స్పందనలో 134 పిటీషన్లు స్వీకరించారు. పిటీషనర్ల బాధలు, సమస్యలను జిల్లా ఎస్పీ సమగ్రంగా విన్నారు. పిటీషనర్ల సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జిల్లా నలమూలల నుండీ విచ్చేశారు. ప్రతీ పిటీషనర్ తో జిల్లా ఎస్పీ ముఖాముఖిగా మాట్లాడారు. కుటుంబ కలహాలు, భర్త/అత్తారింటి వేదింపులు, రస్తా వివాదాలు, ఉద్యోగ మోసాలు, సైబర్ మోసాలు, భూవివాదాలు. ఇలా తమకున్న సమస్యలను ఎస్పీ ముందు స్వేచ్ఛగా విన్నవించారు. పోలీసు పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. కరోనా వేళ. మాస్క్ ధరిస్తూ భౌతిక దూరం పాటించేలా సీటింగ్ . శ్యానిటైజర్ అందుబాటులో ఉంచారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ నాగేంద్రుడు, ఎస్బీ డి ఎస్ సి ఉమా మహేశ్వర్ రెడ్డి, తదితరుల.