ప్రజలు, గిరిజన యువత, పోలీసులతో కలిసి స్వచ్చందంగా గంజాయి నిర్మూలనలో పాల్గొనాలి… వి.రంగారావు విశాఖపట్నం రేంజ్ డీఐజీ
గిరిజన ప్రాంతాలలో ప్రజలు చాలా స్వచ్ఛంగా మానవత్వం మూర్తీభవించి ప్రత్యేక సంస్కృతి కలిగి ఉంటారు. వారి కారణంగా ఎవరికీ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ అన్యాయం, అక్రమం, అనారోగ్యం జరుగుతుందంటే తట్టుకోలేరు.
దేశంలో వివిధ ప్రాంతాలలో యువత గంజాయికి అలవాటుపడి, అనారోగ్యంపాలై వారు, వారి కుటుంబాలు భాదపడుతుంటే మన ప్రాంత ప్రజలు భరించలేక, స్థానిక పోలీసు అధికారుల ద్వారా నిజాన్ని గ్రహించి, ఈ గంజాయి మహమ్మారి నుండి యువతను రక్షించడానికి నడుం బిగించారు.
స్వచ్ఛందంగా చాలా గ్రామాల ప్రజలు, పెద్ద ఎత్తున కదలి వచ్చి, ఇప్పటివరకు తెలియక చేసినదానికి పశ్చాత్తాపపడి, మన ప్రాంతంలో గంజాయి పంటను నిర్మూలిస్తున్నారు. ఇలాంటి ఆదర్శ గిరిజన ప్రజలకు వేవేల నీరాజనాలు.
ఇదేస్పూర్తి ప్రతి గ్రామానికి వ్యాపించాలి. ప్రజలు, ప్రజా నాయకులు, గిరిజన యువత , పోలీసులతో కలిసి, స్వచ్చందంగా గంజాయి నిర్మూలనలో పాల్గొనాలని పిలుపు ఇస్తున్నాము. ఈ స్ఫూర్తి దేశ యువతకు వెలుగు కావాలి. ఈ స్ఫూర్తి మన ప్రాంతానికి అభివృద్ధి వీచిక కావాలి. ఈ స్పూర్తి మన అందరికీ దిశానిర్దేశం కావాలి, మన ప్రాంతాన్ని గంజాయి రహిత ప్రాంతంగా చేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని కోరుతున్నాం.