భవానీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల కౌటింగ్లో ప్రతి రౌండ్‌కు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధిపత్యం పెరుగుతూ వస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతానికి ఆమె తన సమీప బీజేపీ ప్రత్యర్థి ప్రియాంక టిబ్రెవాల్పై 30,000కు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
దీంతో మమత గెలుపు దాదాపు ఖాయమేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు ఆధిక్యం ప్రకటిస్తూ వస్తుండటంతో పార్టీ కార్యకర్తల్లో సంబరాలు మిన్నంటుతున్నాయి. 9వ రౌండ్ ముగిసే నాటికి మమతా బెనర్జీ 28,825 ఓట్ల ఆధిక్యంలో ఉండటంతో టీఎంసీ కార్యకర్తలు, మద్దతుదారులు కోల్‌కతాలోని సీఎం నివాసం వద్ద రంగులు జల్లుకుంటూ నృత్యాలతో, విక్టరీ సంకేతాలతో, నినాదాలతో సంబరాలు చేసుకుంటున్నారు.