సాధారణ రైతు వేషంలో కైకలూరులోని ఎరువుల షాపులకు వెళ్లిన సబ్ కలెక్టర్. ఎరువులు కావాలని ఓ దుకాణంలోకి వెళ్లిన సబ్ కలెక్టర్ కు స్టాక్ ఉన్నా లేవని చెప్పిన యజమాని. అక్కడి నుండి మరో షాపుకు వెళ్లి ఎరువులు కావాలని అడిగిన సబ్ కలెక్టర్. సబ్ కలెక్టర్ అడిగిన ఎరువులు ఇచ్చి MRP ధర కన్నా అధికంగా వసూళ్లు చేసిన సదరు షాపు యజమాని. వసూళ్లు చేసిన సొమ్ముకు బిల్లు సైతం ఇవ్వని యజమాని. ఆ తర్వాత ఒకొక్క అధికారికి ఫోన్ చేసి ఎరువుల షాపుకు పిలిపించిన సబ్ కలెక్టర్.
రెండు షాపులను సీజ్ చేయించిన సబ్ కలెక్టర్. అక్కడి నుండి అధికారులతో కలిసి ముదినేపల్లిలో ఎరువుల షాపుల తనిఖీకి వెళ్లిన సబ్ కలెక్టర్. ముదినేపల్లిలో సబ్ కలెక్టర్ వెళ్లిన షాపు మూసి వేసి ఉండటంతో అక్కడి రైతులను వాకబు చేసిన సబ్ కలెక్టర్. MRP ధరల కన్నా అధికంగా అమ్ముతున్నారని సబ్ కలెక్టర్ కు తెలిపిన రైతులు.షాపు యజమానిని పిలిపించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సబ్ కలెక్టర్ ఆదేశం…!!