ప్రవేట్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ విద్యా సంస్థల సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వ ప్రయత్నం. విద్యా విధానాన్ని బలోపేతం చేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వం వాటిపై కమిటీ వేసి వాటి పనితీరుపై నివేదిక తెప్పించింది. నివేదికలో పలు ఆశ్చర్యకరమమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. పలుచోట్ల కనీస వసతులు కూడా లేని పరిస్థితి. కొన్ని పత్రికలు , ప్రతిపక్షాలు అసత్య ప్రచారం.
ప్రభుత్వం ప్రవేట్ సంస్థలపై ఎలాంటి బలవంతపు ఒత్తడి చేయడం లేదు. కేవలం స్వచ్చందంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ వద్దు అన్న వాటిని మాత్రమే తీసుకుంటాం. వాటిని నాడు నేడు ద్వారా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం. తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విద్యార్థులను దగ్గరలో ఉన్న స్కూల్స్ లో చేరేందుకు అవకాశం.
టీడీపీ రాజకీయం చేస్తోంది.. ప్రవేట్ విద్యా సంస్థల్లో వసతులు కల్పించకుండా పోస్ట్స్ ఖాళీగా ఉంచింది. ఖాళీలు భర్తీ చేయవద్దని టీడీపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఏకంగా లేఖ రాశారు. కమిటీల పేరుతో ఖాళీలు పూర్తి చేసి టీడీపీ అక్రమాలకు పాల్పడింది. క్రమబద్ధీకరణ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. బాగా నడుస్తున్న విద్యా సంస్థలను ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం కృషి చేస్తున్నారు. కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ విద్యా విధానం ఉండాలనే ప్రభుత్వ ఆలోచన. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం చూసి ప్రతిపక్షాలు ప్రభుత్వం పై బురదజల్లే కార్యక్రమాలు. తల్లిదండ్రులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు.
ప్రవేట్ ఎయిడెడ్ విద్యా సంస్థలు ఎలా వచ్చాయో కూడా తెలియని వాళ్ల్లు కూడా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం విద్యా రంగం అభివృద్ధికి అనేక సంస్కరణల్లో భాగంగానే చర్యలు. రెగులేటరీ కమిషన్ ఫిక్స్ చేసిన ఫీజ్ కంటే ఎక్కువ వసూలు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వాస్తవాలను వెల్లడించేందు ఎప్పుడయినా సిద్ధం. బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా నిర్మాణాత్మక ఆరోపణలు , సూచనలు చేయండి. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దు.