ఒంగోలులో లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం జగనన్న. 7.97 లక్షల పొదుపు సంఘాల్లో సభ్యులైన 78.76 లక్షల మంది మహిళలకు లబ్ధి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల నాటికి వారి పేరిట ఉన్న బ్యాంకు అప్పును భరిస్తున్న ప్రభుత్వం.
ఈ పథకం ద్వారా నాలుగు విడతల్లో చెల్లింపు. గత ఏడాది తొలి విడత డబ్బులతో కలిపి రూ.12,758 కోట్లు లబ్ధి. పది రోజుల పాటు కొనసాగనున్న రెండో విడత కార్యక్రమం. తొలి రోజు 83 వేల సంఘాల్లోని 8.19 లక్షల మందికి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు.