ఒంగోలులో బంగారపు షాపులో పనిచేస్తూ యజమానిని వంచించి బంగారమును దొంగతనం చేస్తూ నమ్మక ద్రోహం కు పాల్పడుతున్న ముద్దాయి వాకాటి అనిల్ కుమార్ ను చాకచక్యంగా కొద్దిరోజుల్లోనే పట్టుకొని15 లక్షల 20 వేల విలువగల 337.803 గ్రాముల బంగారం రికవరీ చేసిన ఒంగోలు ఒకటవ పట్టణ పోలీసులు.
ముద్దాయి వివరాలు:
వాకాటి అనిల్ కుమార్ S/o పిచ్చయ్య, 37 y, బలిజ, రాజపానగల్ రోడ్డు 9 లైన్, ఒంగోలు
ఒంగోల్ లోనీ లాయర్ పేట మూడు లైన్లు లో నివాసం ఉంటున్న వేముల తిరుమలేష్ గాంధీ రోడ్డు నందు తిరుమల దుర్గా జూయలర్స్ పేరుతో బంగారు షాప్ పెట్టుకుని వ్యాపారం చేయుచున్నాడు. అయితే తన షాపులో బంగారం వస్తువులు గత కొన్ని నెలలుగా ఒక్కొక్కటి గా మాయమవుతు ఉండం గమనించి తన షాపులో పని చేయుచున్న వారి మీద అనుమానం వ్యక్తం చేస్తూ ఒంగోలు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో 31.07.21 న ఫిర్యాదు చెయ్యగా సదరు ఫిర్యాదు మీద Cr.No. 286/21 U/s 381 IPC క్రింద కేసు నమోదు చేసినారు.
జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గార్గ్ ఐ.పీ.ఎస్ గారు వెంటనే సత్వర కేసు దర్యాప్తు నిమిత్తం ముద్దాయినీ త్వరగా పట్టుకొని బంగారం రికవరీ చేయుటకు ఒంగోలు 1 వ పట్టన ఇన్స్పెక్టర్ CH. సీతారాం గారు ఆధ్వర్యంలో ఎస్ఐలు పి. ముక్కంటి, కే. సురేష్ లు, ASI T. బాల గారు, PC లు P. రఘు, సురేష్, మౌల అలి, CH. అంజిబాబు గార్లతో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసినారు. కేసు దర్యాప్తులో భాగంగా తేదీ 05.08.2021 న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒంగోలు ఆర్టిసి బస్టాండ్ దగ్గర్లో ముద్దాయి సమాచారం అందడంతో ఒంగోల్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సిహెచ్ సీతారాం గారు తన సిబ్బందితో వెంటనే అక్కడికి చేరుకొని ముద్దాయి అనిల్ కుమార్ ను అదుపులోకి తీసుకొని విచారించగా తను నేరాన్ని ఒప్పుకున్నాడు. దర్యాప్తులో భాగంగా అతని వద్ద నుండి 18 బంగారు గాజులు, 5 బంగారు ఉంగరాలు, 3 బంగారు నెక్లెస్ లు, 6 జతల బంగారు చెవి దిద్దులు, 2 జతల బంగారు మాటీలు మొత్తం 15 లక్షల 20 వేల విలువగల 337.803 గ్రాముల బంగారమును చాకచక్యంగా రికవరీ చేసి అతనిని సాయంత్రం 6.30 గంటలకు కు అరెస్టు చేయడం అయినది.
ఈ కేసును త్వరగా ఛేదించి ముద్దాయి ని వెంటనే పట్టుకొని భారీ మొత్తంలో బంగారం రికవరీ చేసిన సిఐ Ch. సీతారామ్ గారిని, ఎస్సైలు K. సురేష్, P. ముక్కంటి, క్రైమ్ సిబ్బంది ASI T. బాలా గారు, PC లు P. రఘు, సురేష్, మౌల అలి, CH. అంజిబాబు గార్లను జిల్లా ఎస్పీ గారు అభినందించారు.