నరసరావుపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు కర్ణ అమర సైదారావు పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ
ప్రభుత్వ ఉపాధ్యాయులను దోపిడీ దొంగలు లాగా ఉగ్రవాదుల్లాగా నిన్న అర్ధరాత్రి ఉపాధ్యాయ నాయకుల ఇళ్లకు వెళ్లి నోటీసులు ఇచ్చి వారిని అవమానకరంగా పోలీసులు అరెస్టు చేయటం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.
సమాజంలో అత్యంత గౌరవనీయమైన వృత్తిలో ఉన్నటువంటి వారిని ఈ విధంగా అరెస్ట్ చేయటం దారుణమైన విషయం .
వారు జీతాలు పెంచమని మిమ్మల్ని అడగలేదు. ట్రాన్స్ఫర్ లు పారదర్శకంగా చేపట్టామని అడిగినందుకే నియంతృత్వంగా వ్యవహరిస్తూ అరెస్టులు చేయటం చాలా బాధాకరమైన విషయం.
మీ ఇష్టం వచ్చినట్లుగా ఆన్లైన్ వెబ్ సైటు పెట్టి .ఆన్లైన్ విధానం సరిగా ఓపెన్ కాకుండా మూడు రోజుల గడువు విధించి. ఉపాధ్యాయులను నెట్ సెంటర్లకు వెళ్లి వెబ్ ఆప్షన్ పెట్టుకోలేక మానసిక ఒత్తిడితో చాలా మంది ఉపాధ్యాయులు మానసిక క్షోభకు గురి అవుతున్నారు .
ఉపాధ్యాయుల బదిలీల విషయం ప్రశ్నించినందుకు ఈ ప్రభుత్వం పోలీసుల చేత అరెస్ట్ చేయటం మీ నియంతృత్వానికి పరాకాష్ట .