ఏపీ లో ప్రభుత్వ పాఠశాలలు కళకళ

విద్యార్థులకు వాతావరణమంతా కొత్తకొత్తగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలు సరికొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. విద్యార్థులు కొత్త యూనిఫారాలతో కొత్త కొత్తగా కనిపిస్తున్నారు. వారికి ఒక చక్కటి బ్యాగ్, షూస్ తో కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. వీటన్నింటితో పాటు కొత్త విద్యా సంవత్సరానికి పుస్తకాలు కూడా సిద్ధంగా ఉన్నాయి.

వాటన్నింటినీ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సకాలంలో అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారి దిశానిర్దేశం మేరకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది.

సుమారు మూడున్నర కోట్ల పుస్తకాలు ఇప్పటికే జిల్లాలకు చేరుకున్నాయి. ఇక అక్కడ నుంచి పాఠశాలలకు వెళ్లేలా చకచకా ఏర్పాట్లు సాగిపోతున్నాయి. విద్యార్థులు రాగానే వారికి అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖాధికారులు చర్యలు చేపట్టారు.

తెలుగుదేశం హయాంలో అయితే ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోలేదు. అంతా కార్పొరేట్ స్కూల్స్ పైనే ప్రజల దృష్టి మళ్లేలా ప్రభుత్వ పాఠశాలల్లో చదువంటేనే అమ్మో..భయం అనుకునేలా చేశారు. దాంతో తల్లిదండ్రులు పగలురాత్రీ కష్టపడి ఆ కార్పొరేట్ స్కూల్స్ కి పిల్లల్ని పంపి రెక్కలు ముక్కలు చేసుకున్నారు.

ఇప్పుడు జగనన్న దీవెనల ఫలితంగా ఆ తల్లిదండ్రుల కష్టాలు తీరాయి. ఇంటికి పెద్దకొడుకులా మారి ఆర్థిక పరిస్థితులు వెంటాడుతున్నా తమ్ముళ్లు, చెల్లెమ్మలను ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. ‘‘చదువుకున్నవాళ్లకి, చదువుకున్నంత’’ అనే స్థాయిలో విద్యాబోధన మూడుపువ్వులు-ఆరు కాయలుగా ఆంధ్రరాష్ట్రంలో నడుస్తోంది.

కరోనా తగ్గిన వెంటనే ఆగస్టులో పాఠశాలలు తెరుద్దామని అనుకుంటున్నారు. ఆ సమయానికి విద్యార్థుల కోసం అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఆంధ్రరాష్ట్రంలో చదివే విద్యార్థులు రేపు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కోరుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.