కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప

* విపత్తు నిర్వహణ చట్టం కింద ఉల్లంఘనలపై చర్యలు చేపట్టండి
* మాస్క్ ల ధరింపు… సామాజిక దూరం పాటించడం, తదితర జాగ్రత్తలు తప్పనిసరి.

 

జిల్లాలో కోవిడ్ – 19 నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప  ఆదేశాలు జారీ చేశారు. విపత్తు నిర్వహణ చట్టం కింద ఉల్లంఘనలపై చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగుతున్నాయని. కర్ఫ్యూ ఆంక్షలు, కోవిడ్ నిబంధనలు ప్రజలు పాటించాలన్నారు. మూడో వేవ్ ఉంటోందన్న ప్రచార నేపథ్యంలో కరోనా పట్ల ఎవరూ నిర్లక్ష్యం చేయరాదన్నారు. ప్రతీ ఒక్కరూ మాస్కు ధరించాలన్నారు. కోవిడ్-19 వైరస్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సులవుగా వ్యాపిస్తుందని… వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినపుడు గానీ, దగ్గినపుడు గానీ ద్రవరూపంలో ఉండే తుంపర్లు గాలి ద్వారా ఎదుటివారి మీద పడే అవకాశం ఉంటుందన్నారు. ఇంకొందరిలో శ్వాసకోస వ్యవస్థలోకి ప్రవేశించే అవకాశం ఉంటుందన్నారు. ఈనేపథ్యంలో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ముక్కు పూర్తిగా కవరయ్యేలా మాస్కు ధరించాలన్నారు. దీంతోపాటు భౌతిక దూరం పాటించడం, చేతులను సబ్బుతో లేదా శానిటైజర్ తో శుభ్రంగా కడుక్కోవడం చేయాలన్నారు. సాధ్యమైనంత వరకు చిన్న పిల్లల్ని బజారుకి, మార్కెట్లకు, రద్దీగా ఉండే ప్రదేశాలకు తీసికెళ్లరాదని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.