గ్రామ సచివాలయాన్ని ఉపయోగించుకోవాలి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్

గ్రామ సచివాలయం ద్వారా నాణ్యమైన సేవలు అందించాలి. సచివాలయానికి వచ్చే సర్వీసులను మరిన్ని పెంచాలి. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్. నార్పలలోని గ్రామ సచివాలయం 4ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.

 

గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని, సచివాలయానికి వచ్చే సర్వీసులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపించాలని సచివాలయ ఉద్యోగులను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. శుక్రవారం నార్పల పట్టణంలోని గ్రామ సచివాలయం -4 ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు మంచి నాణ్యమైన సర్వీసులను అందజేయాలని, సచివాలయం ద్వారా అందిస్తున్న అన్ని రకాల సేవల గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు.

సచివాలయానికి వచ్చే సర్వీసులను ఎలాంటి పెండింగ్ ఉంచరాదని, గడువులోపు సర్వీసులకు ఖచ్చితంగా పరిష్కారం చూపించాలన్నారు. సచివాలయానికి వచ్చే సర్వీసులను మరిన్ని పెంచాలన్నారు. ఉద్యోగులు 100 శాతం ప్రతిరోజు సచివాలయానికి హాజరుకావాలన్నారు. సచివాలయంలో వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి అర్హుల జాబితా తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. సచివాలయం పరిధిలో ఫీవర్ సర్వేను పూర్తిచేసి కరోనా అనుమానిత లక్షణాలు కలిగినవారిని గుర్తించాలన్నారు.

ఈ సందర్భంగా సచివాలయం పరిధిలో వైఎస్సార్ కాపు నేస్తం పథకం కింద ఎంత మందికి లబ్ధి కలిగింది, రైతు భరోసా పథకం కింద ఎంత మందికి లబ్ధి చేకూరింది, కరోనా పాజిటివ్ రేటు, సచివాలయం పరిధిలో ఎంతమంది దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు, ప్రతి రోజూ ఎన్ని సర్వీసులు సచివాలయానికి వస్తున్నాయి, సచివాలయంలో సాఫ్ట్వేర్ బాగా పని చేస్తుందా, తదితర వివరాలను ఎంపీడీవో, సచివాలయ ఉద్యోగులను అడిగి జిల్లా కలెక్టర్ తెలుసుకున్నారు. ప్రజలకు మంచి నాణ్యత కలిగిన సర్వీసులను అందజేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీధర్ మూర్తి, ఎంపీడీవో దివాకర్, పంచాయతి సెక్రటరీ సాయి చరణ్, డిజిటల్ అసిస్టెంట్ శారద, మహిళా పోలీస్ చంద్ర కళావతి, సచివాలయ, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.