జర్నలిస్టులకు అవార్డులు ప్రకటించడం చరిత్రాత్మకం. సీఎం జగన్ కు అభినందనలు. APWJU మచ్చా రామలింగారెడ్డి.

జర్నలిస్టులకు YSRవైఎస్సార్ లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డులు ఇవ్వడం అభినందనీయంAPWJU

-భవిష్యత్తులో గ్రామీణ జర్నలిస్టులకూ అవకాశం కల్పించాలి

సీఎం వైఎస్ జగన్ కు జర్నలిస్టుల పై ప్రేమ కు ఇదే నిదర్శనం

జి వి డి కృష్ణ మోహన్ సజ్జల రామకృష్ణారెడ్డి లకు ప్రత్యేక అభినందనలు

– మచ్చా రామలింగా రెడ్డి
రాష్ట్ర అధ్యక్షులుAPWJU

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్

 

 

👉 దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాదిYSR వైఎస్సార్ లైఫ్ టైం ఎచీవ్ మెంట్ కింది 8 మంది పొత్తూరి వెంకటేశ్వరరావు ఎబికె ప్రసాద్ పాలగుమ్మి సాయినాథ్ కె అమర్నాథ్ తెలకపల్లి రవి సురేంద్ర ఇమామ్ షేక్ కాజా హుస్సేన్ సీనియర్ జర్నలిస్టులను ఎంపిక చేయడం అభినందనీయం అని ఆంద్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (APWJU) రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి పేర్కొన్నారు.

👉రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి సీనియర్ జర్నలిస్టు ల పట్ల ఎంతో గౌరవం ఉందని ఈ అవార్డు నిరూపిస్తాయి అని సీఎం జగన్ కు అభినందనలు తెలుపుతున్న మని మచ్చ రామలింగారెడ్డి అన్నారు

👉అనంతపురం నగరం నందు గల రోడ్డు భవనాల అతిథిగృహం నందు ఈరోజు మచ్చా రామలింగా రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు
👉సీనియర్ జర్నలిస్టులకు అవార్డు ప్రకటించడం ద్వారా జర్నలిస్టులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నట్లు అయ్యింది. రాష్ట్రంలోని యువ జర్నలిస్టులకు స్ఫూర్తి నింపుతుందని మచ్చ అన్నారు.

👉రాష్ట్రంలో రాబోవు రోజుల్లో జర్నలిస్టుల సంక్షేమాన్ని సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో గ్రామీణ విలేకరులకు కూడా ఇలాంటి అవార్డుల ఎంపికలో అవకాశం కల్పించాలని మచ్చ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు

👉ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో ఎదుర్కొంటున్న జర్నలిస్టుల సమస్యలపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు జి.వి.డి. కృష్ణమోహన్, సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టిపెట్టి ఆదుకోవాలని మచ్చా రామలింగారెడ్డి విజ్ఞప్తి చేశారు.

👉విలేకరులకు అవార్డు ఇవ్వడానికి కృషిచేసిన జి వి డి కృష్ణ మోహన్ సజ్జల రామకృష్ణా రెడ్డి గారికి అభినందనలు

👉రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో పని చేసే ఎంతో మంది జర్నలిస్టులు కనీస వేతనాలు లేకుండా పని చేస్తుప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడం, అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేర వేసే విషయంలో కృషి చేస్తున్నారని ఈ సందర్బంగా గుర్తు చేశారు వచ్చే ఏడాది గ్రామీణ విలేకరుల కూడా అవార్డు ఇవ్వాలని మచ్చ సూచించారు.

👉ఈ ఏడాది రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన వివిధ ప్రాంతాలకు చెందిన జర్నలిస్టులు పాలగుమ్మి సాయినాథ్, ఏబీకే ప్రసాద్, పొత్తూరి వెంకటేశ్వర రావు, షేక్ ఖాజా హుస్సేన్, జర్నలిస్టు ఉద్యమ నాయకుడు కె. అమర్నాథ్, సురేంద్ర, తెలకపల్లి రవి, ఇమామ్ లను YSRవైయస్సార్ లైఫ్ టైం ఎచీవ్ మెంట్ కింద అవార్డులు ఇచ్చి సత్కరించడాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్APWJU ఏపీడబ్ల్యూజేయూ తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియచేయడమైనది.

👉విలేకర్ల సమావేశంలో వెంకటేశ్వర్లు భాస్కర్ రెడ్డి విజయ్ రాజు జానీ చలపతి షాకీర శ్రావణ్ ఉపేంద్ర శ్రీకాంత్ మల్లికార్జున తదితర జర్నలిస్టు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్APWJU.

Leave A Reply

Your email address will not be published.