జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టులందరికి అక్రిడిటేషన్ లు ఇవ్వాలి

చిన్న పత్రికలకు గతంలో మాదిరిగానే అక్రిడిటేషన్ లు ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గారికి వినతి. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (APWJU)
👉 అనంతపురం జిల్లాలో గత 20 సంవత్సరాలుగా ఏ విధంగా అయితే వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్ల మంజూరు చేస్తున్నారో అదే విధంగా ఈ ఏడాది కూడా జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టు అందరికీ ఆక్సిడేషన్ లో మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విజ్ఞప్తి చేసింది.

👉మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ APWJU రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది.

👉జిల్లాలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు సబ్ ఎడిటర్లుకు చిన్న చానల్స్ సీనియర్ జర్నలిస్టులకి చిన్న పత్రికలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది అని మీరు పరిశీలించి న్యాయం చేయాలని APWJU, జిల్లా కలెక్టర్ గారిని కొరడమైనది

👉జిల్లాలో గతంలో కూడా వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇచ్చే సంప్రదాయం కొనసాగుతున్నది.

👉రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా అనంతపురం జిల్లాలో ఇప్పటివరకు పని చేసిన కలెక్టర్ లందరూ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇవ్వడం జరిగింది.

👉APWJU వినతిని పరిశీలించి జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ అక్రిడిటేషన్ లు మంజూరు చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ APWJU కొరడమైనది.

👉ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు
రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ, విజయరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి కార్యదర్శి, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ అధ్యక్షకార్యదర్శులు ఉపేంద్ర, చలపతి, యూనియన్ సభ్యులు జానీ, బాలు, షకీర్, శహనాజ్, త్యాగరాజు, రవి,తదితరులు పాల్గొన్నారు.

💎ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, అనంతపురం జిల్లా శాఖ (A.P.W.J.U)💎

Leave A Reply

Your email address will not be published.