తాడిపత్రిలో ఫ్యాక్షన్ రూపుమాపు ఎస్పీ పకీరప్ప తాడిపత్రి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పి పకీరప్ప

— జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు

* తాడిపత్రి అర్బన్ , రూరల్ పోలీసు స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

పోలీసుస్టేషన్ల నిర్వహణపై పరిశీలన… ప్రాధాన్యతగా మహిళా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశాలు జిల్లాలో ఫ్యాక్షన్ కట్టడికి గట్టి చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు పేర్కొన్నారు. శనివారం ఆయన తాడిపత్రి అర్బన్ , రూరల్ పోలీసు స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీసుస్టేషన్ల నిర్వహణ, పరిసరాలు, మహిళా హెల్ప్ డెస్క్ లను పరిశీలించారు. పిటీషన్లు ఎన్ని వచ్చాయి, వాటి పరిష్కారానికి పోలీసులు చేసిన కృషి, పిటీషన్ల స్థితిపై ఆరా తీశారు. ప్రాధాన్యతగా మహిళా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించాక జిల్లా వ్యాప్తంగా పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితుల పరిశీలనలో భాగంగా పోలీసు స్టేషన్లు విజిట్ చేశాను. తాడిపత్రి ప్రాంతంలో ఉంటున్న సమస్యలు… ముఖ్యంగా శాంతిభద్రతల గురించి స్థానిక డీఎస్పీతో చర్చించాను. శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటాము. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీ ప్రసక్తే లేదన్నారు. ఫ్యాక్షన్ నియంత్రణకు కార్యాచరణ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాం. ఫ్యాక్షన్ గ్రామాల్లో ఏమి జరుగుతోన్నది దృష్టి సారించి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నాం. అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోబోతున్నాం. ఎవర్నీ ఉపేంక్షించం. అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు గట్టిగా వ్యవహరిస్తాం. వీటితో పాటు బక్రీద్ వేళ ముస్లిం మత పెద్దలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించి ప్రశాంతంగా జరుపుకునేలా చర్యలు తీసుకున్నాం. జిల్లా ఎస్పీతో పాటు తాడిపత్రి డీఎస్పీ చైతన్య, అర్బన్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, తాడిపత్రి రూరల్ సి.ఐ జి.టి నాయుడు, తదితరులు వెళ్లారు.

Leave A Reply

Your email address will not be published.