దిశ యాప్ తో రక్షణ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్

ఆపదలో ఉన్న మహిళలకు దిశ యాప్ తో రక్షణ.శింగనమల ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ , జిల్లా ఎస్పీల వెల్లడి. జిల్లాలో విసత్తృంగా దిశ యాప్ ఇన్ స్టాల్ చేయించాలని పిలుపు. నార్పల కేజిబివి బాలికల పాఠశాలలో దిశ యాప్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం.

రాష్ట్ర ప్రభుత్వం ఆపదలో ఉన్న మహిళల భద్రత కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ యాప్ మహిళలకు రక్షణగా నిలుస్తుందని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి , జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ , జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి స్పష్టం చేశారు. జిల్లాలో విస్తృతంగా దిశ యాప్ ఇన్ స్టాల్ చేయించాలని వారు పిలుపునిచ్చారు. శుక్రవారం నార్పల కేజిబివి బాలికల పాఠశాలలో దిశ యాప్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్ , ఎస్పీలు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత/ రక్షణను ప్రాధాన్యతగా పరిగణించి దిశ యాప్ ను రూపొందించి సేవలు అందిస్తోందన్నారు. ప్రతీ మహిళ మొబైల్ ఫోన్ లో దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, ఇన్‌స్టాల్‌ చేసుకుంటే చాలన్నారు. ఆ తర్వాత ఇంటర్నెట్‌ ఉన్నా లేకున్నా ఫోన్‌ ద్వారా ఈ యాప్‌ను వినియోగించుకోవచ్చన్నారు. దిశ SOS బటన్‌ నొక్కడం ద్వారా గానీ.ఫోన్‌ను గట్టిగా అటూఇటూ ఉపడం ద్వారా గానీ ఆపదలో ఉన్న మహిళలు దిశ కాల్‌ సెంటర్‌కు సమాచారం ఇవ్వవచ్చన్నారు.

ఆ తర్వాత ఆపదలో ఉన్న మహిళలను కాపాడేందుకు దిశ కంట్రోల్‌ రూమ్‌ నుంచి పోలీసులకు ఆటోమేటిక్‌గా సమాచారం అందుతుందన్నారు. తద్వారా పోలీసుల సేవలు వినియోగించుకుని రక్షణ పొందవచ్చన్నారు. ప్రతీ మహిళ/ అమ్మాయి దిశ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుని ఆపద సమయంలో పోలీసుల సేవలు వినియోగించుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఏ.సిరి, అనంతపురం డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.