దిశ యాప్ సేవలపై మహిళల్లో విస్తృతంగా అవగాహన చేయండి. జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప

డ్వాక్రా, అంగన్వాడీ, వార్డు వలంటీర్లు, మహిళా పోలీసుల, మహిళా మిత్ర కమిటీల సహకారం తీసుకోండి. ఫోన్లలో దిశ యాప్ ఇన్ స్టాల్ చేయించి పోలీసుల సేవలు వినియోగించుకునేలా చైతన్యం చేయండ. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు.

మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ యాప్ పై జిల్లాలోని మహిళల్లో విస్తృతంగా అవగాహన చేయాలని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు ఆదేశించారు. జిల్లాలో ఉన్న డ్వాక్రా, అంగన్వాడీ సిబ్బంది, వార్డు వలంటీర్లు, మహిళా పోలీసు, మహిళా మిత్ర కమిటీ సభ్యుల సహకారం తీసుకోవాలని సూచించారు. మహిళల భద్రత/ రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ఇందులో భాగంగానే… ఆపదల్లో ఉన్న మహిళల కోసం దిశ యాప్ రూపొందించి సేవలు అందిస్తోందన్నారు. తొలుత ఇంటర్నెట్‌ సాయంతో దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, ఇన్‌స్టాల్‌ చేసుకుంటే చాలు.. ఆ తర్వాత ఇంటర్నెట్‌ ఉన్నా లేకున్నా ఫోన్‌ ద్వారా ఈ యాప్‌ను వినియోగించుకోవచ్చు. SOS బటన్‌ నొక్కడం ద్వారా గానీ… ఫోన్‌ను గట్టిగా అటూఇటూ ఉపడం ద్వారా గానీ ఆపదలో ఉన్న మహిళలు దిశ కాల్‌ సెంటర్‌కు సమాచారం ఇవ్వవచ్చన్నారు. ఆ తర్వాత ఆపద/ ప్రమాదంలో ఉన్న మహిళలను కాపాడేందుకు దిశ కంట్రోల్‌ రూమ్‌ నుంచి పోలీసులకు ఆటోమేటిక్‌గా సమాచారం అందుతుంది. తద్వారా పోలీసుల సేవలు వినియోగించుకుని రక్షణ పొందవచ్చన్నారు. ప్రతీ మహిళ/ అమ్మాయి దిశ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుని ఆపద సమయంలో పోలీసుల సేవలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.