నేటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ

డీలర్ల ద్వారానే పీఎంజీకేఏవై కోటా ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న బియ్యం పంపిణీ రాష్ట్రంలో మంగళవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ పంపిణీని రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ డీలర్ల ద్వారా చేపట్టాలని పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే రెగ్యులర్‌ పీడీఎస్‌ కింద రేషన్‌ సరుకులు పంపిణీ చేయగా, కరోనా నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన ఉచిత బియ్యాన్ని ఇప్పుడు పంపిణీ చేయబోతున్నారు.

అయితే ఈసారి ఉచితంగా ఇచ్చే బియ్యం పీఎంజీకేఏవై కింద కేంద్రం ఇస్తుందన్న విషయాన్ని రేషన్‌ షాపుల్లో ప్రత్యేకంగా పోస్టర్లు కట్టి ప్రచారం చేస్తున్నారు. ఎవరు ఉచితంగా ఇస్తున్నారనేది పేదలకు తెలియాలన్న ఉద్దేశంతో ఈ మేరకు పోస్టర్లు కట్టాలని కేంద్రమే రాష్ర్టాలకు ఆదేశాలు జారీచేసింది. అయితే కేంద్రం ఉచితంగా ఇచ్చే బియ్యం మొత్తం 1.47 కోట్ల కార్డుల్లో.. 88 లక్షల ఎన్‌ఎ్‌ఫఎ్‌సఏ కార్డులకే వస్తాయని, మిగిలిన 59 లక్షల కార్డులకిచ్చే బియ్యం భారం మొత్తాన్ని తామే భరిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

Leave A Reply

Your email address will not be published.