పోలీస్ శాఖ మీ వెన్నంటే ఉంటుంది. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పల నాయుడు.

రాష్ట్ర డి.జి.పి శ్రీ గౌతం సవాంగ్, ఐ.పి.యస్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్ గారు తన కార్యాలయం నుండి జిల్లా వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న గ్రామ/వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు (మహిళా పోలీసులు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి వారి యొక్క విధుల గురించి చేయవలసిన పనుల గురించి దిశానిర్దేశం చేసి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

🔅 (విధి విధానాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామ/వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు (మహిళా పోలీసులు) మాట్లాడిన జిల్లా యస్.పి.*

🔅 ప్రభుత్వం అన్ని విధాలుగా కార్యాచరణ చేపట్టింది.

🔅 పోలీస్ శాఖ ఎల్లవేలలా మీకు తోడుగా ఉంటుంది.

🔅 నిర్భయంగా విధులు నిర్వహించండి.

🔅 క్షేత్ర స్థాయిలో మహిళల సమస్యలను పరిష్కరించవలసింది మీరే.

🔅 ప్రతి యొక్క సమస్యను మీ పరిధిలోని పోలీస్ వారికి తెలియపరచాలి.

🔅 పోలీస్ శాఖ అన్ని విధాలుగా సహకరిస్తుంది.

🔅 దిశా యాప్ డౌన్లోడ్ కార్యక్రమాలను వాడవాడలా ఉదృతంగా డౌన్లోడ్ కార్యక్రమాలు చేపట్టాలి.

🔅 విధుల యందు ఏదైనా సమస్యలు ఉంటె మీ స్టేషన్ హౌస్ ఆఫీస్ కు తెలియపరచాలి.

🔅 ప్రలోభాలకు గురికావద్దు.

🔅 క్రమశిక్షణతో విధులు నిర్వహించి మీ ఉద్యోగానికి న్యాయం చేయండి.

గ్రామ/వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులకు (మహిళా పోలీసులు) ప్రభుత్వం ఒక చక్కటి అవకాశాన్ని మహిళలకు కల్పించిందని, ఆ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పట్టణ, గ్రామ స్థాయిలో మహిళల సమస్యలను తెలుసుకొని వాటిని పోలీస్ శాఖకు తెలియపరచి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలి. మహిళా పోలీసులు పోలీస్ శాఖలో అంతర్భాగం మహిళల భద్రత కోసం ఇంటింటికి వెళ్లి మహిళల యొక్క సమస్యలను అడిగి తెలుసుకొని సంబందిత అధికారులకు తెలియపరచాలి. దిశా యాప్ విశిష్టతలు గురించి ప్రతి ఒక్కరికి తెలియపరచాలి. దిశా యాప్ పై మహిళలలో ఒక చైతన్యాన్ని తీసుకురావాలి. మహిళలు, చిన్నారులపై జరిగే అగత్యాలను నిరోధించడానికి మహిళా పోలీసులు ముందుండాలి.

మీ ప్రాంతంలో మహిళలు పడే సమస్యలను తెలుసుకొని వాటికి పరిష్కార మార్గం చూపాలి. మీ భాద్యతను సమాజ సేవ కోసం అంకితం చేయండి. ప్రజలతో మమేకమై వారితో తత్సంబందాలు ఏర్పరుచుకొని ఎప్పటికప్పుడు వారి సమస్యలను తెలుసుకొని భాద్యతతో పనులు నిర్వహించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి స్పూర్తితో పోలీస్ విభాగం మీ వెనుక నుండి మిమ్మల్ని ముందుకు నడిపించడానికి అన్ని వేళలా కృషి చేస్తూ ఉంది. ఈ అవకాశం ప్రతి ఒక్కరికి రాదు, వచ్చినప్పుడు దానిని సక్రమైన మార్గంలో నిర్వహించడం మన విధి. కావున ప్రతి ఒక్కరు కష్టపడి అప్పగించిన పనులను అలసత్వం లేకుండా క్రమశిక్షణతో పూర్తి చేయాలని ఈ సందర్భంగా జిల్లా యస్.పి గారు మహిళా పోలీసులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా అడిషనల్ యస్.పి లు, డి.యస్.పి లు, సి.ఐ లు, మహిళా పోలీసులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.