బక్రీద్ (ఇద్-ఉల్-అజా) సందర్భంగా గౌరవ ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషన్ హరిచందన్ గారి సందేశం.

బక్రీద్ (ఇద్-ఉల్-అజా) పండుగ శుభ సందర్భంగా, ఆంధ్రప్రదేశ్‌ ముస్లిం సోదరులందరికీ
నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బక్రీద్ పండుగ ఇస్లామిక్ మతంలో ఎంతో ప్రాముఖ్యత కలిగినది. ఈ పండుగను ప్రత్యేక ప్రార్థనలు భక్తి భావాలతో జరుపుకుంటారు.

 

బక్రిద్ పండుగ త్యాగనిరతి, దేవుని పట్ల సంపూర్ణ భక్తి, విశ్వాసం, పేదల పట్ల కరుణ, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం ద్వారా కోవిడ్ -19 వ్యాప్తిని నివారించడానికి సహకరించాలని ఈ సందర్భంగాఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.

Leave A Reply

Your email address will not be published.