ముస్లిం సోదర సోదరీమణులకు ఎమ్మెల్యే #తోపుదుర్తిప్రకాష్రెడ్డి గారు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.

ముస్లిం సోదర సోదరీమణులకు ఎమ్మెల్యే #తోపుదుర్తిప్రకాష్రెడ్డి గారు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలన్నారు. ‘‘దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకొంటారన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు చేసుకునే ఈ పండుగ భక్తి భావానికి, త్యాగానికి చిహ్నమని అన్నారు.

పేదల పట్ల జాలి, దయ కలిగి ఉండటమే బక్రీద్‌ ఇచ్చే సందేశమన్నారు.బక్రీద్‌ను ముస్లిం సోదర సోదరిమణులందరు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.కరోనా నేపథ్యంలో అందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించి నమాజు చేసుకోవాలని,అలానే కరోనా మహమ్మారి భారీ నుండి అందరం బయట పడాలని అందరూ ఆ అల్లాని ప్రార్ధించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.