శాంతిభధ్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారం ప్రాధాన్యతగా జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప

బుక్కరాయసముద్రం పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ. పోలీసుస్టేషన్లు, రికార్డుల నిర్వహణపై లోతుగా పరిశీలన. శాంతిభధ్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారం ప్రాధాన్యతగా విధులుండాలని ఆదేశాలు. బుక్కరాయసముద్రం పోలీసు స్టేషన్ ను ఈరోజు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పోలీసు స్టేషన్ , పరిసరాలను సందర్శించి పోలీసుస్టేషన్ నిర్వహణ మరియు రికార్డుల నిర్వహణపై లోతుగా పరిశీలించారు. విధుల్లో భాగంగా పోలీసులు మెయింటేన్ చేసే ప్రతీ రికార్డును సమీక్షించారు. అనంతరం పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాల్లోని పరిస్థితులను సి.ఐ సాయి ప్రసాద్ ను అడిగి తెలుసుకున్నారు. శాంతిభధ్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారం ప్రాధాన్యతగా విధులుండాలని ఆదేశించారు. ఫ్యాక్షన్ నియంత్రణకు కార్యాచరణ ప్రణాళికలతో ముందుకు వెళ్లాలన్నారు. ఫ్యాక్షన్ గ్రామాల్లో ఏమి జరుగుతోన్నది దృష్టి సారించి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించడంతో పాటు అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ మద్యం, ఇసుక, మట్కా, గుట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్ , తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు గట్టిగా పని చేయాలన్నారు. అవినీతికి తావులేకుండా అంకితబావంతో ప్రజలకు సేవ చేయాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.