శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో రాజీపడం ఎస్పీగా డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి

అనంతపురం జిల్లా ఎస్పీగా డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు గురువారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరిగిన ఎస్పీల బదిలీల్లో భాగంగా ఈయన కర్నూలు జిల్లా నుండీ ఇక్కడి ఎస్పీగా బదిలీ అయ్యారు. ఈనేపథ్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలోని తన ఛేంబర్లో ఈరోజు బాధ్యతలు చేపట్టారు.అనంతరం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో మీడియాతో మాట్లాడారు.

అనంతపురం జిల్లా ఎస్పీగా తనను నియమించినందుకు గౌరవ రాష్ట్ర డి.జి.పి శ్రీ డి.గౌతం సవాంగ్ IPS గారికి కృతజ్ఞతలు.

గత ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS గారు చేపట్టిన చర్యలు, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తాం

శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో రాజీపడంమహిళా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తాం

క్రైం అగెనెస్ట్ ఉమెన్ పై ప్రత్యేక దృష్టి… ముందస్తు చర్యలుఒక్కో జిల్లాలో ఒక్కో రకమైన సమస్యలు ఉంటాయి. ఈక్రమంలో జిల్లాలోని సమస్యలు, పోలీసుల పనితీరుపై అధ్యయనం చేసి అవగాహన చేసుకుంటాంపోలీసు సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటాం

అవినీతికి తావు లేకుండా పారదర్శక విధులు విధులు నిర్వహిస్తాం

అనంతపురం రేంజ్ డి.ఐ.జి శ్రీ కాంతి రాణా టాటా IPS గారి ఆదేశాల మేరకు సమిష్టిగా విధులు చేపడతాం

జిల్లా ప్రజలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జీవించేందుకు అన్నివర్గాల ప్రజల్ని కలుపుకుని ముందుకెళ్తాం

Leave A Reply

Your email address will not be published.