శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది.

శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయంలో నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం ఇవాళ సోమవారం ఉదయం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 88,051 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 7,063 క్యూసెక్కులు గా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా…. ప్రస్తుతం ఇవాళ సోమవారం ఉదయం 825.13 అడుగులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 44.88 (20.80%) టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం ఎడమగట్టు (తెలంగాణ) జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండగా…. కుడి గట్టు (ఆంధ్రప్రదేశ్) జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి మాత్రం ప్రారంభం కాలేదు.

Leave A Reply

Your email address will not be published.