‘అనంత’ ఎస్పీని కలిసిన నదీం

ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు హిరియల్ నదీం అహమ్మద్ అనంతపురం ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లిని ఆయన కార్యాలయంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పచ్చని మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపోయారు.

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయంటూ అభినందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ‘దిశ’ యాప్ గురించి అమ్మాయిలు, మహిళల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్న తీరు బాగుందని నదీం ప్రశంసించారు.

Leave A Reply

Your email address will not be published.