ఒలింపిక్స్ లో బూతుల పోటీలు పెడితే.. కాంస్యం కొడాలినాని, రజతం అవంతిలదే.. మంతెన సత్యనారాయణరాజు

ఉన్నత చదువులు చదివి, ఉజ్వల భవిష్యత్ ఉన్న రమ్య హత్యకు గురైందని రాష్ట్రమంతా బాధపడుతుంటే..మంత్రులు అవంతి శ్రీనివాస్, కొడాలి నాని మాత్రం జగన్ ని లోకేశ్ ఏదో అన్నాడని బాధపడటం సిగ్గుచేటు. వైసీపీ వైఖరితో రమ్య ఆత్మ ఘోషిస్తోంది. దళిత యువతి కుటుంబానికి అన్యాయం జరిగితే నోరుమెదపని వైసీపీ నేతలు‎ ముఖ్యమంత్రి జగన్ ని లోకేశ్ విమర్శించారని బయటకొచ్చి మాట్లాడటం సిగ్గుచేటు.

దళిత యువతి దారుణ హత్యకు గురైతే అవంతి, కొడాలి నాని ఎక్కడున్నారు? ఎందుకు స్పందించలేదు? మంత్రులకు బాధిత కుటుంబాన్ని పరామర్శించే బాధ్యత లేదా? లేక తీరిక లేదా? దళిత యువతి దారుణ హత్యకు గురైందన్న బాధ కంటే జగన్ ని లోకేశ్ విమర్శించారన్న బాధే వీరిలో ఎక్కువగా కన్పిస్తోంది. మీరు బాధపడాల్సింది లోకేశ్ జగన్ ని విమర్శించినందుకు కాదు, జగన్ రమ్య కుటుంబానికి న్యాయం చేయనందుకు బాధపడాలి. మంత్రి పదవి పోకుండా కాపాడుకోవుకోవటం కోసం కొడాలి నాని, అవంతి తమ నోళ్లు పోగొట్టకుంటున్నారు. ఒలంపిక్స్ లో బూతుల పోటీలు నిర్వహిస్తే కాంస్యం కొడాలి నానికి, రజతం అవంతి శ్రీనివాస్ లకే వస్తుంది.

లోకేశ్ మాట్లాడిన దానిలో తప్పేంటో వైసీపీ నేతలు చెప్పాలి, దళిత యువతి రమ్య ప్రాణాలు కోల్పోయింది మీ చేతకాని పాలన వల్ల కాదా? పట్టపగలు నడిరోడ్డుపై మహిళలపై హత్యలు, దాడులు జరుగుతున్నాయంటే మీ ప్రభుత్వ అసమర్ధ, వైఫల్యం కాదా? చేతికి అందిచ్చిన కూతురిని కోల్పోయి ఆ దళిత కుటుంబం పడుతున్న భాద వైసీపీ కళ్లకు కన్పించటం లేదా? వైసీపీ ప్రభుత్వం బాధిత కుటుంబానికి న్యాయం చేయకపోగా న్యాయం చేయమని కోరిన టీడీపీ నేతలపై కేసులు పెట్టడం దుర్మార్గం. టీడీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులు ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలి. రమ్య కుటుంబానికి రూ. 1 కోటి అందజేసి అన్ని విధాల ఆధుకోవాలి.

Leave A Reply

Your email address will not be published.