జగన్ సర్కార్ కీలక నిర్ణయం… పెళ్లిళ్లు,సభలు సమావేశాలకు లిమిట్ అతిక్రమిస్తే..

కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వివాహాలు, ధార్మిక సభలు, సమావేశాలకు హాజరయ్యే వారి సంఖ్యకు పరిధి నిర్దేశిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. గరిష్టస్థాయిలో 150 మందికి మాత్రమే ఈ తరహా సమూహ కార్యక్రమాల్లో హాజరయ్యేందుకు అనుమతి ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సమూహ కార్యక్రమాల సందర్భంగా మాస్కులు ధరించటం, శానిటైజేషన్ లాంటి చర్యలు తప్పనిసరి చేసింది. ఆయా కార్యక్రమాల్లో భౌతిక దూరం ఉండేలా సీట్ల మధ్య ఖాళీ వదలాలని సూచించింది. సీట్లు లేని చోట్ల మనిషికి, మనిషికి మధ్య కనీసం ఐదడుగులు దూరం ఉండేలా చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించింది. సామూహిక కార్యక్రమాల్లో నిబంధనల ఉల్లంఘనలు జరిగితే విపత్తు నిర్వహణా చట్టం కింద, ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయనున్నట్టు జగన్ సర్కార్ స్పష్టం చేసింది.

Leave A Reply

Your email address will not be published.