జనఆశీర్వాద సభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కోవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలి. మాస్కులను ధరించాలి. శ్రీవారి పాదాల చెంత ప్రజల ఆశీస్సుల కోసం ఈ ప్రాంతానికి వచ్చాం. సమర్థవంతమైన పాలన మోడీ అందిస్తున్నారు. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ మిషన్ భారతదేశంలో ఉంది. దేశంలో ఆక్సిజన్ కొరతను అధిగమించారు.

మోడీ పిలుపుతో ప్రతి ఇంటిలో మాస్కులు ఇళ్ళలోనే తయారు చేసుకున్నారు. వ్యాక్సిన్ పై పరిశోధన చేసి దేశంలోని 130కోట్లమంది ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తున్నాం. ప్రపంచ దేశాలు భారతదేశాన్ని చూసి ఆశ్యర్యపోతున్నాయి. వ్యాక్సిన్ ప్రక్రియను కేంద్రం యజ్ఞం లా నిర్వహిస్తోంది. ప్రధానిగా మోడీ ఉండడం వల్లనే ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. మోడీ పాలనలో బాంబు పేలుళ్ళు, మత కల్లోలాలు, కర్ఫూలు ఎక్కడా లేవు.

Leave A Reply

Your email address will not be published.