డ్రైవింగ్ లైసెన్స్ ప్రతీ ఒక్కరికీ తప్పనిసరి….. జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప.

జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో LLR మేళా నిర్వహణ. పోలీసులకు పరీక్షలు నిర్వహించి 457 మందికి LLR లు జారీ. ప్రతీ ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి అని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు సూచించారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ఈరోజు LLR మేళా నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడారు. ప్రజలపై చలానాలు జారీ చేయాలంటే ముందు మనం కరెక్టుగా ఉండాలి.

జిల్లాలో 3500 మంది సిబ్బంది ఉంటే 60 శాతం డ్రైవింగ్ లైసెన్స్ లు లేవు. ప్రతీ ఏటా 10 మంది రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్నారు. ఆ సందర్భంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే న్యాయపరంగా ఇబ్బందులు తలెత్తకుండా ప్రయోజనాలు పక్కాగా అందుతాయి. అందుకే ఈ మేళా నిర్వహించి 30 రోజుల తర్వాత డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేయనున్నారు. హెల్మెట్ ధరింపు కూడా చాలా ముఖ్యం. ప్రతీ సిబ్బందికి డ్రైవింగ్ లైసెన్స్ , హెల్మెట్ లు ఉండాలి. అనంతరం 457 మందికి జారీ చేసిన LLR లను ఎస్పీ గారు అందజేశారు. ఈసందర్భంగా డి.టి.సి ఎన్ శివరాంప్రసాద్ మాట్లాడారు. జిల్లా ఎస్పీ గారు మంచి సంకల్పంతో సంక్షేమంలో భాగంగా పోలీసు సిబ్బందికి మేళా నిర్వహించి LLR లు ఇప్పించడం ముదావహమన్నారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీలు నాగేంద్రుడు, రామకృష్ణ ప్రసాద్ , హనుమంతు, ఎం.వి.ఐ లు వర ప్రసాద్ , దామోదర్ నాయుడు, సి.ఐ సూర్యనారాయణ, ఆర్ ఐ లు శ్రీశైలరెడ్డి, టైటాస్ , నారాయణ, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్ , సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.