పాము కాటుకు గురైన కానిస్టేబుల్ ను వీడియో కాల్ ద్వారా పరామర్శించిన కృష్ణాజిల్లా ఎస్పీ

గడిచిన రాత్రి ముసునూరు పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ బీట్ విధులు నిర్వహిస్తున్న సమయంలో పాముకాటుకు గురై ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటుండగా ఈరోజు జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాముకాటుకు గురైన కానిస్టేబుల్ శివ కిరణ్ ను పరామర్శించి, అతని ఆరోగ్య పరిస్థితులను గూర్చి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

అలాగే రాత్రి సమయం అయినప్పటికీ పాముకాటుకు గురైన సమయంలో ఎలాంటి భయానికి లోను కాకుండా అత్యంత సమయస్ఫూర్తిగా వ్యవహరించి తోటి సహచర కానిస్టేబుల్ యొక్క ప్రాణాలు కాపాడిన కిషోర్ ను ప్రత్యేకంగా అభినందించారు.

శివ కిరణ్ తో మాట్లాడుతూ గడిచిన రాత్రి నుండి ఇప్పటివరకు శరీరంలో ఏమైనా మార్పులు చోటు చేసుకున్నది లేనిది, ఆరోగ్యం ఏ విధంగా ఉన్నది అడిగి తెలుసుకున్నారు. పాము కాటు ఇవన్నీ ఈ కాలంలో సర్వసాధారణమని వాటి గూర్చి ఆందోళన చెందవలసిన, అవసరం లేదని, మీ డిఎస్పీ గారు సిఐ గారు పాముకాటుకు గురైన వద్ద నుండి ఇప్పటివరకు మిమ్మల్ని కంటికిరెప్పలా చూసుకున్నారని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. అందుకు ఆ కానిస్టేబుల్ సొంత బిడ్డలా ఇప్పటివరకు నా యొక్క యోగక్షేమాలు తెలుసుకున్న డి.ఎస్.పి గారికి సిఐ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అని, మీ ఆధ్వర్యంలో విధులు నిర్వర్తించి నందుకు చాలా ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తపరిచాడు

Leave A Reply

Your email address will not be published.