మరి కాసేపట్లో ఏపీ కేబినెట్‌ భేటి

సీఎం జగన్‌ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రహదారులు, భవనాల శాఖకు చెందిన 4వేల కోట్ల ఆస్తులను ఆర్టీసీ కి బదలాయించే అంశంపై ఈ భేటిలో మంత్రివర్గం చర్చించనుంది.

అలాగే ఏపీ లాజిస్టిక్‌ పార్కుల ఏర్పాటు ప్రతిపాదనలపై చర్చించే ఛాన్స్ ఉంది. జాతీయ విద్యా విధానాన్ని ఎలా అమలు చేయాలనే దానిపై కూడా మంత్రులు ఒక నిర్ణయానికి రానున్నారు. పోలవరం ముంపు బాధితులకు మరో 10లక్షలు అదనంగా ఇచ్చే అంశంపై కూడా సమీక్షించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.