మాతృ భాష లేనిదే మనిషికి మనుగడ లేదు… సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

ఆంగ్లం మోజులో తెలుగును నిర్లక్ష్యం చేయడం తగదు – సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ. తెలుగు రక్షణకు భాషావేత్తలు ఉద్యమస్థాయిలో పనిచేయాలన్నారు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ. వీధి అరుగు, దక్షిణాఫ్రికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన భాషా సదస్సులో ఆయన వర్చువల్​గా ప్రసంగించారు. అమ్మభాష మాట్లాడటాన్ని ప్రతి ఒక్కరూ గౌరవంగా భావించాలని సూచించారు.

ఆంగ్లం మోజులో తెలుగును నిర్లక్ష్యం చేయడం తగదని వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాలు ఇలాంటి కార్యక్రమాలకు చేయూత ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. భాషను ప్రజలకు చేరువచేసే కార్యక్రమాలు చేపడతాయని ఆశిస్తున్నానని చెప్పారు. రేపు.. గిడుగు 158వ జయంతి సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ నివాళులు అర్పించారు. తెలుగు సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న వారికి అభినందనలు తెలిపారు. దేశవిదేశాల్లో పేరు తెచ్చుకున్న తెలుగు ముద్దుబిడ్డలకు శుభాకాంక్షలు చెప్పారు.

తెలుగువాళ్లు ఎన్నో రంగాల్లో తమ ప్రతిభ చాటుకున్నారని.. ప్రస్తుతం తెలుగుభాషకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందన్నారు. ఏ సమాజంలోనైనా భాష, సంస్కృతి పెనవేసుకుని ఉంటాయని చెప్పారు. సర్దుబాట్లు చేసుకుని సమాజం, భాష, సంస్కృతికి ఇబ్బందులు తప్పవని వ్యాఖ్యానించారు. తెలుగు సమాజం నిత్యం సర్దుబాట్లు చేసుకుంటూ ముందుకెళ్తోందన్నారు. జపాన్, చైనాలో నేటికీ మాతృభాషలోనే విద్యాభ్యాసం జరుగుతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలుగు అభివృద్ధికి సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా వాడుకోవాలని సూచించారు.

తెలుగు రక్షణకు భాషావేత్తలు ఉద్యమస్థాయిలో పనిచేయాలి. మాతృభాష లేనిదే మనిషికి మనుగడ లేదు. అమ్మభాష మాట్లాడటాన్ని ప్రతి ఒక్కరూ గౌరవంగా భావించాలి. ఆంగ్లం మోజులో తెలుగును నిర్లక్ష్యం చేయడం తగదు. రేపు గిడుగు 158వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి. భాషను ప్రగతిశీలం చేసిన యుగపురుషుడు గిడుగు రామమూర్తి. కందుకూరి, గురజాడ, గిడుగు.. వాడుకభాషను జనం వద్దకు చేర్చారు. తెలుగు సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న వారికి అభినందనలు’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.