మొహరం వేళ కోవిడ్ నిబంధనలు తప్పనిసరి…జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప

జిల్లాలో జరుగుతున్న మొహరం వేడుకల వేళ కోవిడ్ నిబంధనలు తప్పనిసరి అని… గొడవలు, అల్లర్లకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు పేర్కొన్నారు. కరోన థర్డ్ వేవ్ వస్తుందనే ప్రచార నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పీర్ల చావిడి వద్ద అధికంగా జనం గుమిగూడటం చేయరాదన్నారు. పీర్ల ఊరేగింపులో సమూహాలకు తావులేకుండా సాఫీగా నిర్వహించుకోవచ్చన్నారు. ప్రతీ ఒక్కరూ మాస్కు ధరించి సామాజిక దూరం పాటించాలన్నారు.

పీర్ల ఊరేగింపులో గాని… పీర్ల గుండం వద్ద గానీ గుంపులుగా ఏర్పడి అలావ్ తొక్కడం, డి.జె లు పెట్టుకుని డ్యాన్సులు చేయరాదన్నారు. హిందూ-ముస్లింల ఐక్యతకు మారుపేరైన మొహరం పండుగను పురస్కరించుకొని జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకున్నామన్నారు. మొహరం వేడుకల్లో గొడవలకు దిగి చట్టాన్ని చేతిలో తీసుకోవాలనుకుంటే అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. క్రిమినల్ కేసులు నమోదు తోపాటు రౌడీషీట్లు ఓపెన్ చేస్తామన్నారు. మొహరం వేడుకలు ఆనందోత్సవాల మధ్య ప్రశాంతంగా జరుపుకోవాలి తప్ప గొడవలు అల్లర్ల నడుమ కాదన్నారు. మొహరం పండుగ జరుగుతున్న సమస్యాత్మక, ఫ్యాక్షన్ గ్రామాల్లో ప్రత్యేక పోలీసు బృందాలుచే నిఘా పెట్టామన్నారు. సుశిక్షితులైన స్పెషల్ పార్టీ మరియు ఏ ఆర్ సిబ్బందితో మొబైల్ పార్టీలు ఏర్పాటు చేసి రంగంలోకి దింపామన్నారు. మొహరం వేడుకలలో భాగంగా కీలకమైన పెద్ద సరిగెత్తి, జలధి కార్యక్రమాలు పూర్తయ్యే వరకు ఈ బృందాలు ఆయా సమస్యాత్మక మరియు ఫ్యాక్షన్ గ్రామాల్లో గస్తీలు చేపట్టనున్నాయన్నారు.

Leave A Reply

Your email address will not be published.