యార్లగడ్డ పదవీ కాలం పొడిగింపు

అధికార భాషా సంఘం అధ్యక్షునిగా యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత రెండు సంవత్సరాలుగా ఈ పదవిలో యార్లగడ్డ కొనసాగుతుండగా, 2023 ఆగస్టు 25 వరకు ఆయన పదవిలో ఉండనున్నారు.

క్యాబినేట్ హోదాతో పాటు మంత్రుల‌కు వ‌ర్తించే జీతభత్యాలు, సదుపాయాలు అన్నీ ఈ ప‌ద‌వికి వర్తిస్తాయని పర్యాటక, భాషా సాంస్కృతిక, క్రీడా, యువజనాభ్యుదయ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌భార్గవ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.