రాష్ట్ర ప్రజలకు హృదయ పూర్వక శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన… గవర్నర్

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ శ్రీ హరిచందన్ మాట్లాడుతూ జన్మాష్టమి నేపథ్యంలో శ్రీకృష్ణుని శాశ్వతమైన సందేశాన్ని భగవద్గీత గుర్తు చేస్తుందన్నారు.

సామరస్యపూర్వక సమాజ నిర్మాణానికి అవసరమైన పునాదిని స్పష్ట పరుస్తుందన్నారు. ఈ పవిత్రమైన సందర్భం శాంతి, పురోగతి, శ్రేయస్సుకి దారితీస్తుందని, రాష్ట్ర ప్రజల మధ్య సోదరభావం, స్నేహం, సామరస్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు దోహదం చేస్తుందని గవర్నర్ ప్రస్తుతించారు. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, సానిటైజర్‌తో క్రమం తప్పకుండా చేతులు శుభ్రం చేసుకోవటం వంటి కోవిడ్‌ ప్రవర్తనకు కట్టుబడి పండుగను జరుపు కోవాలని గవర్నర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అర్హులైన వారందరూ ఎటువంటి ఆలస్యం లేకుండా టీకాలు వేయించుకోవాలని హరిచందన్ అన్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.

Leave A Reply

Your email address will not be published.