అనంతపురం వ్యాపారులందరూ వ్యాక్సినేషన్ వేయించుకోండి.. మేయర్ వసీం

వ్యాపారస్తూలందరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని నగర మేయర్ మహమ్మద్ వసీం సూచించారు. నగరంలోని జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కూరగాయల మార్కెట్ లో శుక్రవారం వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నగర మేయర్ మహమ్మద్ వసీం మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏ కే ఎస్ ఫయాజ్ తో కలసి పరిశీలించారు.

ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ వ్యాపారులు అనునిత్యం అనేక మంది తో లావాదేవీలు నిర్వహిస్తుంటారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్ నుండి రక్షణ పొందాలి అంటే వ్యాక్సినేషన్ తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించారు.వ్యాక్సినేషన్ పట్ల నిర్లక్ష్యం చేయవద్దని, అంతేకాకుండా అపోహలు వద్దని సూచించారు. వ్యాపార సంఘాల నాయకులు కూడా ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకొనేలా చూడాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కమల్ భూషణ్, నగర పాలక సంస్థ కార్యదర్శి సంగం శ్రీనివాసులు,వ్యాపార సంఘము నాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.