2018 వరకు పెండింగులో ఉన్న గ్రేవ్ & నాన్ గ్రేవ్ యూ.ఐ కేసులపై సమీక్ష…జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప

గ్రేవ్ & నాన్ గ్రేవ్ యు.ఐ కేసుల పెండెన్సీ తగ్గించండి. దర్యాప్తు అధికారులతో జిల్లా ఎస్పీ జూమ్ వీడియో కాన్ఫరెన్స్. జిల్లాలో ఉన్న పాత గ్రేవ్ & నాన్ గ్రేవ్ యు.ఐ కేసుల పెండెన్సీని త్వరితగతిన తగ్గించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు ఆదేశించారు.

జిల్లాలోని దర్యాప్తు అధికారులతో ఆయన మంగళవారం రాత్రి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2018 డిశంబర్ 31 వరకు పెండింగులో ఉన్న గ్రేవ్ & నాన్ గ్రేవ్ యూ.ఐ కేసులను సర్కిల్ వారీగా సమీక్ష చేశారు. ఆయా కేసుల్లో దర్యాప్తు ఏ దశలో ఉందో ఆరా తీశారు. నిందితుల అరెస్టు మొదలు చార్జిషీటు దాఖలు వరకు ఎలా త్వరితగతిన పరిష్కారం చేయవచ్చో తగిన సూచనలు, మెళకువలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.