కాపాడాల్సిన పోలీసులే జర్నలిస్టులను చంపితే కాపాడేవారెవరు…APWJU రాష్ట్ర అధ్యక్షుడు మచ్చారామలింగారెడ్డి

నంద్యాల V5 రిపోర్టర్ కేశవ్ హత్య దారుణం.

పోలీసులే విలేకరులను చంపితే ఎలా..

రాష్ట్ర ప్రభుత్వం యూట్యూబ్ ఛానల్ కోసం ప్రత్యేక విధానం తయారు చేయాలి

కేశవ్ కుటుంబానికి 25 లక్షలు ప్రభుత్వం ఇవ్వాలి

కేశవ్ కుటుంబానికి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించాలి.

రాష్ట్రంలో జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి మీడియా స్వేచ్ఛను కాపాడాలి

సీఎం వైఎస్ జగన్ జర్నలిస్టుల సమస్యలపై దృష్టి పెట్టాలి

మచ్చా రామలింగారెడ్డి
రాష్ట్ర అధ్యక్షులు APWJU
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ డిమాండ్

_________________________________________________________________రాష్ట్రంలో జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని మీడియా స్వేచ్ఛను కాపాడాలని యూట్యూబ్ ఛానల్ లో పనిచేస్తున్న జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు APWJU ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ డిమాండ్ చేశారు.

నంద్యాలలో యూట్యూబ్ V5 ఛానల్ రిపోర్టర్ కేశవ్ హత్య దారుణం దుండగులకు కఠిన శిక్ష విధించాలని ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని, కేశవ హత్య మీడియాపై దాడిగానే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ చూస్తున్నదని హత్యచేసిన చేసిన కానిస్టేబుల్ ని ఉద్యోగం నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము మచ్చా రామలింగారెడ్డి అన్నారు. ఈ రోజు అనంతపురం నగరంలోని R&B అతిథి గృహం నందు విలేకర్ల సమావేశంలో మచ్చ రామలింగారెడ్డి మాట్లాడారు.

రాష్ట్రంలో పనిచేస్తున్న యూట్యూబ్ జర్నలిస్టులకు రక్షణతో పాటు వారు ఛానల్స్ నిర్వహించుకోవడానికి ప్రత్యేక విధివిధానాలను తయారుచేసి సమాచార శాఖ జర్నలిస్టులకు అండగా ఉండాలని యూట్యూబ్ ఛానల్స్ ని ప్రోత్సహించాలని మచ్చా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కొంత మంది రాజకీయ నాయకులు, అధికారులు తమకు వ్యతిరేకంగా వార్తలు వస్తే జర్నలిస్టుని భయపేడుతున్నారని అవసరమైతే చంపడానికి కూడా వెనకాడటం లేదని నంద్యాల సంఘటన రుజువు చేస్తున్నది అని మచ్చా ఆవేదన వ్యక్తం చేశారు.

V5 రిపోర్టర్ కేశవ్ కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఇవ్వాలి, కేశవ్ కుటుంబానికి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించాలని మచ్చా రామలింగారెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు అందరూ చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని చానల్స్ అన్ని పేపర్లకు, చిన్న పత్రికలు, యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులకు ప్రభుత్వం రక్షణ కల్పించి జర్నలిస్టులను ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జర్నలిస్టులకు అండగా ఉండాలని మచ్చా రామలింగారెడ్డి కోరారు.

సమావేశనికి ముందు V5 రిపోర్టర్ కేశవ్ ఆత్మకు శాంతి చేకూరలని విలేకరులు మౌనం పాటించారు. విలేకర్ల సమావేశంలో వెంకటేశ్వర్లు విజయరాజు, భాస్కర్ రెడ్డి చలపతి, ఉపేంద్ర, తదితర జర్నలిస్టు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.