ఏపీ పోలీసులకు 130 అవార్డులు డీజీపీ గౌతమ్ సవాంగ్.

జాతీయ స్థాయిలో మరోసారి సత్తాచాటిన ఏపి పోలీస్ శాఖ. అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డ్స్-2021. జాతీయ స్థాయిలో పాస్ పోర్ట్ వెరిఫికేషన్ లో వరుసగా మూడోసారి మొదటి స్థానంలో నిలిచిన ఎపి పోలీస్. ఎపిలో కేవలం రెండు రోజుల వ్యవధిలోనే పాస్ పోర్ట్ దరఖాస్తు వెరిఫికేషన్ ను పూర్తి చేస్తున్న పోలీసులు.

టెక్నాలజీ క్షేత్రం లో జాతీయస్థాయిలో అవార్డులను ప్రకటించిన డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డ్స్-2021. అత్యంత ఆధునిక టెక్నాలజీ వినియౌగంలో 04 అవార్డులను సొంతం చేసుకున్న ఎపి పోలీసు శాఖ. ఈ అవార్డులను పోలీస్ హెడ్ హెడ్క్వార్టర్స్ 3 కైవసం చేసుకోగా, అనంతపురం 01 అవార్డును కైవసం చేసుకుంది. కేవలం స్వల్ప నెలల కాలవ్యవధిలో జాతీయస్థాయిలో అత్యధికంగా 130 అవార్డులను దక్కించుకొని దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ.

డిజిటల్ హెల్త్ ప్రొఫైల్, HAWK, బాడి వొర్న్ కెమెరా స్ట్రీమింగ్,కోవిడ్ ట్రాకర్లు జాతీయ స్థాయిలో సత్తా చాటాయి. గతంలో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా స్వల్ప నెలల వ్యవధిలో రికార్డ్ స్థాయి అవార్డులను దక్కించుకున్న ఏకైక ప్రభుత్వ విభాగం ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ. దేశం మొత్తం మీద డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డ్స్-2021 నాలుగు జాతీయ అవార్డులను గెలుచుకున్న శాఖ ఏదైనా ఉంది అంటే అది ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ మాత్రమే.

ఈ అవార్డులు మా బాధ్యత ను మరింతగా పెంచాయి.ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారితనంతో , త్వరతగతిన సేవలందించే దిశగా అడుగులు వేస్తున్నామని, జాతీయ స్థాయిలో అవార్డులను దక్కించుకున్న విజేతలందరిని అభినందిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ. వైఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు పోలీస్ శాఖకు ఇస్తున్న ప్రాముఖ్యతతోనే సత్ఫలితాలు సాధిస్తున్నామన్న ఎపి డీజీపీ గౌతం సవాంగ్ IPS. పారదర్శకత, జవాబుదారీతనం, సత్వర న్యాయం లకు గీటురాయిగా ఎపి పోలీస్

Leave A Reply

Your email address will not be published.