కోడిమి జర్నలిస్ట్ కాలనీలో పట్టాలు అమ్మినా ఎవరైనా కొన్న చెల్లవు…మచ్చా రామలింగారెడ్డి

జర్నలిస్టులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. కోడిమి జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి చేయాలి. వై.యస్ జగనన్న జర్నలిస్టుల పచ్చతోరణం కార్యక్రమంలో ప్రతి జర్నలిస్టు పాల్గొనాలి… మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు APWJU ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపు.

అనంతపురం జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఇల్లు నిర్మించాలని ఇందుకోసం జర్నలిస్టులు అందరూ ఐకమత్యంగా ముందుకెళ్లాలని, జిల్లా కలెక్టర్ ఇతర ప్రజా ప్రతినిధులను కలిసి కోడిమి జర్నలిస్టు కాలనీలో మౌలిక వసతులు కోసం కోరాలని మచ్చా రామలింగారెడ్డి APWJU
రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ పిలుపునిచ్చారు.

కోడిమిలో జరిగిన జర్నలిస్టుల సమావేశంలో ఆదివారం ఉదయం జర్నలిస్ట్ కాలనీ నందు ఏపీ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మచ్చా రామలింగారెడ్డి పాల్గొన్నారు సమావేశానికి సీనియర్ జర్నలిస్టు సంజీవ రెడ్డి అధ్యక్షత వహించారు సమావేశంలో సొసైటీ కార్యదర్శి విజయరాజు తదితర జర్నలిస్టు పాల్గొని..

జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించి రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై జర్నలిస్ట్ డెవలప్ మెంట్ సొసైటీ తీర్మానించింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మచ్చా రామలింగారెడ్డి జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటి జర్నలిస్టు కాలనీ కోడిమి జర్నలిస్టు కాలనీ అని అందరూ ఐకమత్యంతో మౌలిక వసతులు సాధించుకోవాలని ఇందుకోసం జర్నలిస్టులు అందరూ చేయి చేయి కలిపి ముందుకు వెళ్లాలని సూచించారు.

కోడిమి జర్నలిస్ట్ కాలనీలో రోడ్లు డ్రైనేజీ ఇతర మౌలిక వసతుల కోసం పోరాటం చేయాలని సమావేశం నిర్ణయించింది. జిల్లాలోని అనంతపురం నగరంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అందుకోసం జర్నలిస్టు సొసైటీ పోరాడాలని నిర్ణయించింది. కోడిమి జర్నలిస్ట్ కాలనీలో జర్నలిస్టు పొందిన పట్టాలు ఎవరు అమ్మడానికి కొనడానికి వీలు లేదని అలా అమ్మినా, కొన్న చెల్లవని సమావేశం నిర్ణయించింది. కోడిమిలో పట్టాలు అమ్ముకుంటున్న జర్నలిస్టులపై అధికారులకు ఫిర్యాదు చేసి పట్టా రద్దు చేయించాలని సమావేశం నిర్ణయించింది.

సెప్టెంబర్ 8,9 తేదిలలో జర్నలిస్ట్ కాలనీలో జరిగే సీఎం వైఎస్ జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో జిల్లాలోని ప్రతి జర్నలిస్టు పాల్గొని ఒక మొక్క నాటాలని రామలింగారెడ్డి పిలుపునిచ్చారు. 4000 మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి జర్నలిస్టు ప్రింట్ &ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్లు, చిన్న పత్రికల ఎడిటర్లు, రిపోర్టర్లు, సీనియర్ జర్నలిస్టులు పాల్గొని మొక్కలు నాటాలని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ ఆహ్వానిస్తూ విజ్ఞప్తి చేస్తున్నదని మచ్చా అన్నారు. ఈ సమావేశంలో రవికిరణ్, హిందూ ప్రసాద్, హరికృష్ణ, శ్రీరాములు, హరి, నాయక్, బాలకృష్ణ, ప్రకాష్, షకీర్, శ్రావణ్, చలపతి, ఉపేంద్ర, శ్రీకాంత్, దాదు, పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొన్నారు.

💎ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ (A.P.J.D.S)💎

Leave A Reply

Your email address will not be published.