జర్నలిస్టులకి అండగా ఉంటాం… జిల్లా ఎస్పీ ఫక్కిరప్ప

జర్నలిస్ట్ కాలనీలో పోలీసులు మొక్కలు నాటుతారు. రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ స్పూర్తిని ఇవ్వాలి అనంత ఎస్పీ ఫక్కిరప్ప. సీఎం వైయస్ జగన్ అన్న పచ్చతోరణం పోస్టర్ను ఆవిష్కరించిన ఎస్పీ ఫక్కిరప్ప. రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ అనంతపురం నగరం కొడిమి జర్నలిస్ట్ కాలనీలో జరిగే శ్రీ వైయస్ జగనన్న జర్నలిస్టుల పచ్చతోరణం కార్యక్రమం స్ఫూర్తిని ఇస్తుందని అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కిరప్ప అన్నారు.

అనంతపురం నగరంలోని ఎస్పీ కార్యాలయం నందు గల కాన్ఫరెన్స్ హాల్లో APJDS, APWJU ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగే శ్రీ వై.ఎస్ జగనన్న జర్నలిస్టుల పచ్చతోరణం కార్యక్రమం పోస్టర్ని జిల్లా ఎస్పీ కె.ఫక్కిరప్ప ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ కె.ఫక్కిరప్ప మాట్లాడుతూ జర్నలిస్టులు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం మచ్చా రామలింగారెడ్డి నాయకత్వంలో ముందుకెళ్లడం అభినందనీయమన్నారు.

4000 వేల మొక్కలు నాటే కార్యక్రమంలో పోలీసులు కూడా పాల్గొని కొడిమి జర్నలిస్ట్ కాలనీలో మొక్కలు నాటాలని ఎస్పీ ఫక్కిరప్ప అన్నారు. జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని జర్నలిస్టులకు తోడుగా ఉంటామని జిల్లా ఎస్పీ ఫక్కిరప్ప అన్నారు. సెప్టెంబర్ 8, 9వ తేదిలలో కొడిమి జర్నలిస్ట్ కాలనీలో జరిగే జగనన్న పచ్చతోరణంలో నేను కూడా మీతో పాటు పాల్గొని జర్నలిస్ట్ కాలనీలో మొక్కలు నాటు తానని ఎస్పీ ఫక్కిరప్ప అన్నారు.

మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటి జర్నలిస్ట్ కాలనీ కొడిమి జర్నలిస్ట్ కాలనీలో జర్నలిస్టులు అందరూ పాల్గొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. జర్నలిస్టులు అందరూ ఐకమత్యంగా ముందుకెళ్లాలని పోలీసుల సహకారం అందిస్తున్నందుకు జిల్లా ఎస్పీ ఫక్కిరప్ప గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని మచ్చా అన్నారు. శ్రీ వైఎస్ జగనన్న జర్నలిస్టుల పచ్చతోరణం 4000 మొక్కలు నాటే కార్యక్రమం పోస్టర్ని ఎస్పి ప్రారంభించిన అనంతరం APJDS, వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో విజయరాజు, శ్రావణ్, సాక్షి బాలు, సతీష్, రాము, రంగనాథ్, ఆంధ్రజ్యోతి హరికృష్ణ, మల్లికార్జున, హరి, షాకీర్, ఉపేంద్ర, చలపతి, దాదు, మల్లికార్జున, రాజారామ్, బాలు, జానీ, శ్రీకాంత్, త్యాగరాజు, పెద్దఎత్తున ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ APJDS, APWJU

Leave A Reply

Your email address will not be published.